- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెద్దాస్పత్రిలో దారుణం.. చనిపోయాక ఆక్సిజన్ పెట్టిన్రు
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కరోనాతో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు బెడ్ పై నుంచి కింద పడి మృతిచెందిన ఘటన కలకలం సృష్టిస్తోంది. ఆక్సిజన్ అందక గిల గిలా కొట్టుకుంటున్నా సాయం చేయడానికి ఎవరూ రాలేదని, వార్డులోని మరో పేషెంట్ ఫోన్ కాల్ ఆడియో, ఫోటోలు విడుదల చేశారు. కింద పడి చనిపోయిన తర్వాత మంచంపైకి మృతదేహాన్ని చేర్చి ఆక్సిజన్ పెట్టారని తెలిపాడు. దీంతో ఈ ఆసుపత్రిలో ఎంతటి […]</p>

X
దిశ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పెద్దాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. కరోనాతో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు బెడ్ పై నుంచి కింద పడి మృతిచెందిన ఘటన కలకలం సృష్టిస్తోంది. ఆక్సిజన్ అందక గిల గిలా కొట్టుకుంటున్నా సాయం చేయడానికి ఎవరూ రాలేదని, వార్డులోని మరో పేషెంట్ ఫోన్ కాల్ ఆడియో, ఫోటోలు విడుదల చేశారు. కింద పడి చనిపోయిన తర్వాత మంచంపైకి మృతదేహాన్ని చేర్చి ఆక్సిజన్ పెట్టారని తెలిపాడు. దీంతో ఈ ఆసుపత్రిలో ఎంతటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చని పేషెంట్లు చెప్తున్నారు. కోవిద్ వార్డుల్లో పేషెంట్ కేర్ చూసుకునే సిబ్బంది లేకపోవడం వల్లే ఆలస్యమైందని ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి.
Next Story






