- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బకాసుర రెస్టారెంట్ నుంచి అదిరిపోయే అప్‌డేట్..
నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ (Praveen) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బకాసుర రెస్టారెంట్’ (Bakasura Restaurant).

దిశ, సినిమా: నటుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ (Praveen) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బకాసుర రెస్టారెంట్’ (Bakasura Restaurant). వైవా హర్ష (Viva Harsha) టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ తదితరులు ముఖ్య ప్రాతల్లో నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్‌జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మిస్తుండగా.. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇలా అన్ని అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. తాజాగా ఫస్ట్ లిరికల్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘బకాసుర రెస్టారెంట్’ ఫస్ట్ లిరికల్ మే 29న రాబోతున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కాగా.. రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు మేకర్స్.






