- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మాయిలను పెళ్లి కూతురిలా రెడీ చేసి మరీ ఆ పని చేసే సైకో.. ఓటీటీలో అదరగొడుతున్న క్రైమ్ సినిమా
ప్రస్తుత కాలంలో ఓటీటీ(OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఓటీటీ(OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా మంచి మంచి యాక్షన్, క్రైమ్ సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
ప్రస్తుతం ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆడియన్స్‌ను కట్టి పడేస్తోంది. ఊహించని ట్విస్టులతో మతిపోగొట్టేలా చేస్తోంది. చివరి వరకు ఈ సస్పెన్స్ కొనసాగడం ప్రేక్షకులను బాగా థ్రిల్‌కు గురి చేస్తోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక మహా నగరంలో వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతుంటాయి. అయితే చంపే ముందు వారిని పెళ్లి కూతురిలా అలంకరిస్తుంటాడు సైకో. ఆ తర్వాత చిత్ర వధ చేసి చంపుతుంటాడు. అలా నగరంలో చాలా మంది పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు ఈ సైకో చేతిలో దారుణంగా హత్యకు గురవుతారు. చివరకు ఇన్స్పెక్టర్ భార్యని కూడా కిడ్నాప్ చేసి ఒక శవపేటికలో పూడ్చి పెడతాడు.
నీ భార్యని బ్రతికించుకో అని హీరోకి సవాల్ విసురుతాడు. మరి చివరికి హీరో తన భార్య ను కాపాడుకుంటాడా? పోలీసులు ఈ సైకోను పట్టుకున్నారా? అసలు ఆ సైకో ఎందుకిలా చేస్తున్నాడు? అమ్మాయిలు పెళ్లి కూతురిలా అలంకరించి చంపాల్సిన అవసరమేముంది? అన్నది తెలుసుకోవాలంటే ‘చాల్చిత్రో’ అనే బెంగాలీ సినిమా చూడాల్సిందే. 2024 లో విడుదలైన ‘చాల్చిత్రో’(Chalchitro) సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు కానీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో మూవీని చూసేయొచ్చు.
ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని రకాల బాధ్యతలను ప్రతిమ్.డి. గుప్తా(Pratim D Gupta)నే తీసుకున్నారు. ఇందులో తెలుగులో ధైర్యం సినిమాలో హీరోయిన్ గా నటించిన రైమా సేన్(Rymasen) ఒక కీలక పాత్రలో నటించింది. అలాగే తోట రాయ్ చౌదరి, అనిర్బన చక్రవర్తి ,తనికా బాస, శాంతాను మహేశ్వరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మరి మీకు ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టమైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసేయండి.






