ఆ విధానాలను ఓటు ద్వారా తిరస్కరించాలి…

by Shyam |

<p>దిశ ప్రతినిధి, మెదక్: దుబ్బాక ఉప ఎన్నికల్లో మతతత్వ శక్తులను ఓడించి బహుజనుల ఉమ్మడి అభ్యర్థి మాధవ చారిని గెలిపించాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ పిలుపునిచ్చారు. రాయపోల్ మండలంలోని వడ్డేపల్లి, రాంసాగర్, వీరనగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని బహుజనుల ఉమ్మడి అభ్యర్థి మధు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో జరిగిన సభల్లో శంకర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఓటు ద్వారా తిరస్కరించాలని [&hellip;]</p>

ఆ విధానాలను ఓటు ద్వారా తిరస్కరించాలి…
X

దిశ ప్రతినిధి, మెదక్:
దుబ్బాక ఉప ఎన్నికల్లో మతతత్వ శక్తులను ఓడించి బహుజనుల ఉమ్మడి అభ్యర్థి మాధవ చారిని గెలిపించాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ పిలుపునిచ్చారు. రాయపోల్ మండలంలోని వడ్డేపల్లి, రాంసాగర్, వీరనగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని బహుజనుల ఉమ్మడి అభ్యర్థి మధు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో జరిగిన సభల్లో శంకర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఓటు ద్వారా తిరస్కరించాలని అన్నారు. మతోన్మాదులను నియోజకవర్గం నుండి తరిమివేయాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. అభ్యర్థి మధు మాట్లాడుతూ.. దొరల అంతం బహుజనుల పంతంగా ఎన్నికలలో పోరాటం చేస్తున్నమని తెలిపారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి బహుజనుల శక్తి చాటాలన్నారు.

Next Story