- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Operation Sindoor: చండీగఢ్ లో మరోసారి మోగిన సైరన్లు
చండిగఢ్ లో సైరన్లు మరోసారి మోగాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో : భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం చండీగఢ్‌లో (Chandigarh) వైమానిక దాడి హెచ్చరిక సైరన్ (Sirens sounded) మోగింది. డ్రోన్, క్షిపణుల దాడులు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బాల్కానీలకు దూరంగా ఇళ్లలోనే ఉండాలని భారత వైమానిక దళం హెచ్చరిస్తూ సైరన్ మోగించింది. మరోవైపు సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘన చర్యలు కొనసాగుతున్నాయి. పంజాబ్‌పై డ్రోన్స్, మిస్సైల్స్‌లో ఎటాక్‌కు ఆ దేశ సైన్యం యత్నిస్తోంది. భారత జవాన్లు దీటుగా ఎదుర్కొంటున్నారు. పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్నారు. తాజాగా అమృత్‌సర్‌లోనూ ఎయిర్ రైడ్ సైరన్ మళ్లీ మోగింది. పాక్ నుంచి వచ్చే డ్రోన్లు, మిస్సైల్స్‌ను నిర్వీర్యం చేసేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంది.
Next Story






