- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ నెల 25న ఎన్డీఏ సీఎంలతో ప్రధాని మోడీ సమావేశం?
ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ సీఎంలతో మరియు ఇతర ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ సీఎంలతో మరియు ఇతర ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఆ నేతలకు వివరించనున్నట్టు సమాచారం. ఆపరేషన్‌లో ఉగ్రవాద శిబిరాలపై చేసిన దాడుల గురించి వివరించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించడంపై ప్రశంసలు వచ్చాయి.
దేశ నలుమూలల నుండి ఆపరేషన్ సిందూర్ కు మద్దతు లభించింది. ప్రతిపక్ష నేతలు సైతం ప్రధాని తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. కానీ భారత ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకారం చేసుకోవడంతో ఎన్డీఏ సర్కార్ పై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఒకప్పుడు ఇందిరా గాంధీ యుద్ధం చేశారని కానీ ఇప్పుడు మోడీ వెనకడుగు వేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సిందూర్‌పై నేతలకు అవగాహన కల్పించడం ద్వారా తిప్పికొట్టేలా చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.






