Operation Sindoor : ఆన్లైన్ లోనూ పాక్ వస్తువులు అమ్మడానికి వీల్లేదు : ఈ కామర్స్ కు కేంద్రం ఆర్డర్స్

by Muthe.Rajitha |   (  Updated:2025-05-14 16:24:55  IST  )

పాకిస్తాన్(Pakistan) కు భారత్(Bharat) మరో షాక్ ఇచ్చింది.

Operation Sindoor : ఆన్లైన్ లోనూ పాక్ వస్తువులు అమ్మడానికి వీల్లేదు : ఈ కామర్స్ కు కేంద్రం  ఆర్డర్స్
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్(Pakistan) కు భారత్(Bharat) మరో షాక్ ఇచ్చింది. పాక్ వస్తువులను భారత్ లో అమ్మకూడదు అంటూ ఈ కామర్స్(E-Commerce) సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) నేపథ్యంలో.. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) అమెజాన్(Amezon), ఫ్లిప్‌కార్ట్(Flipkart), ఉబై ఇండియా(Ubuy India), ఎట్సీ(Etsy) వంటి ఈ-కామర్స్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఆయా సంస్థల్లో.. పాకిస్తాన్ జెండాలు, లోగోలతో కూడిన టీ-షర్ట్‌లు, మగ్‌లు వంటి వస్తువులను విక్రయిస్తున్నారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(CAIT) కేంద్రానికి ఫిర్యాదు చేసింది.

ఆయా వస్తువుల అమ్మకం భారత పౌరుల మనోభావాలను గాయపరుస్తుందని, శత్రు దేశాన్ని సూచించే వస్తువుల విక్రయం అనుచితం అని తన ఫిర్యాదులో పేర్కొంటూ.. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీలకు తెలిపింది. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం ఈ ప్లాట్‌ఫారమ్‌లను తక్షణమే పాకిస్తాన్ సంబంధిత వస్తువులను తొలగించాలని, అమ్మకాల వివరాలు, విక్రేతల సమాచారాన్ని సమర్పించాలని ఆదేశించింది. జాతీయ భద్రత, వినియోగదారుల హక్కుల రక్షణ కోసం ఈ చర్య తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ X లో తెలిపారు.

Next Story