‘కుక్కతోక వంకర’.. మరోసారి రుజువు చేసిన పాకిస్తాన్

by Gantepaka Srikanth |

పాముకు పాలుపోసి పెంచడం ఎంత ప్రమాదమో.. పాకిస్తాన్‌(Pakistan)ను నమ్మడం కూడా అంతే ప్రమాదమని మరోసారి రుజువైంది.

‘కుక్కతోక వంకర’.. మరోసారి రుజువు చేసిన పాకిస్తాన్
X

దిశ, వెబ్‌డెస్క్: పాముకు పాలుపోసి పెంచడం ఎంత ప్రమాదమో.. పాకిస్తాన్‌(Pakistan)ను నమ్మడం కూడా అంతే ప్రమాదమని మరోసారి రుజువైంది. కాల్పులు విరమిస్తున్నామని(Ceasefire).. గొప్పగా ప్రకటించి కొన్ని గంటల్లోనే ఉల్లంఘించింది. శనివారం ఉదయం దాడులకు పాల్పడగా.. భారత సైన్యం ధీటుగా ఎదుర్కొన్నది. అగ్రరాజ్యమైన అమెరికా జోక్యం చేసుకొని ఇరు దేశాలను శాంతి చర్చలకు ఒప్పించింది. సాయంత్రం ఇరు దేశాల విదేశాంగ శాఖల మంత్రులు సైతం శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఇది జరిగిన నాలుగు గంటల్లోనే పాక్.. తన వక్రబుద్ధిని చూపించింది. సరిహద్దు నగరాల్లో వరుసగా డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లే టార్గెట్‌గా డ్రోన్‌లు, ఆర్టిలరీ గన్స్‌తో ఎటాక్ చేస్తోంది. భారత సైన్యం అప్రమత్తంగా ఉండటంతో పెను ముప్పు తప్పింది.

అన్ని చోట్లా పాక్ చేస్తున్న దాడుల్ని ధీటుగా తిప్పికొడుతోంది. యుద్ధ వాతావరణం మళ్లీ మొదలు కావడంతో సున్నితమైన సరిహద్దు ప్రాంతాలను బ్లాక్‌ అవుట్ చేశారు. శనివారం రాత్రి అనూహ్య కాల్పులపై జమ్మూ, గుజరాత్ సీఎం‌లు స్పందించారు. భారీ శబ్ధాలు వినిపిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. సీజ్‌ఫైర్ అంటే ఇదేనా? అంటూ పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్‌ దాడులను అప్రమత్తంగా ఉండి తిప్పికొడుతోన్న సైన్యాన్ని అభినందిస్తున్నారు. పాక్ వక్రబుద్ధిపై ఇండియాలోని పలువురు మేధావులు మండిపడుతున్నారు. కుక్కతోక వంకరే ఉంటుందని.. అది ఎంత సరిచేసినా కుదరదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story