- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor : భారత మిలిటరీ రైళ్లపై పాక్ నజర్! ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు
భారత ఆర్మీ(Indian Army) 'ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) పేరుతో పాకిస్తాన్, POKలోని 9 ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం అర్థరాత్రి దాడి చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : భారత ఆర్మీ(Indian Army) 'ఆపరేషన్ సిందూర్'(Operation Sindoor) పేరుతో పాకిస్తాన్, POKలోని 9 ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం అర్థరాత్రి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల అనంతరం భారత్-పాక్(Bharat-Pak Conflicts) మధ్య ఉద్రిక్తతలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది భారత టూరిస్టులను హతమార్చిన ఉగ్రదాడికి రివెంజ్‌గా... ఆపరేషన్ సిందూర్ పేరుతో 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది ఇండియన్ ఆర్మీ. జైష్-ఎ-మహమ్మద్ లీడర్ మసూద్ అజహర్ కుటుంబంలో 14 మంది చనిపోగా.. 31 మంది సాధారణ పౌరులు మరణించారని, మసీదు లాంటి ప్రాంతాలు దెబ్బతిన్నాయని పాక్ ఆరోపించింది.
ఈ దాడుల నేపథ్యంలో భారత మిలిటరీ రైళ్ల(Inidan Militory Trains) కదలికలపై పాకిస్తాన్ నిఘా పెట్టిందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ రైళ్లు సైనికులు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తీసుకెళ్తాయి కాబట్టి, వీటి సమాచారం పాక్ చేతికి చిక్కితే భారత సైన్యం కదలికలను అంచనా వేసి దాడులు ప్లాన్ చేయొచ్చునని పాక్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఇలాగే పంజాబ్‌లోని ముకేరియన్ టోల్ నాకా వద్ద ISI ఏజెంట్లు ఆర్మీ కదలికల గురించి సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు.
రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు ఎక్కువ కావడం.. భారత్ డైరెక్ట్ గా దాడులకు దిగడంతో పాక్ నిఘా మరింత పెరిగిందని, అప్రమత్తంగా ఉండమని రైల్వే మంత్రిత్వ శాఖ ఉద్యోగులకు చెప్పినట్టు సమాచారం. దీంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు మిలిటరీ రైళ్ల భద్రతను కట్టుదిట్టం చేశాయి. CCTV, డ్రోన్‌లతో నిఘా పెంచడంతోపాటు.. ఎలాంటి సమాచారం లీక్ కాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేసింది రైల్వేశాఖ.






