- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ సిందూర్.. రాజద్రోహం అంటూ సంచలన పోస్ట్ పెట్టిన యాంకర్ రష్మీ .. సొంత నాయకుల విమర్శ.. శత్రువుపై పొగడ్తలు..
యాంకర్ రష్మీ గౌతమ్ కరెంట్ ఇష్యూస్‌పై స్పందించడంలో ముందుంటుంది. ఈ క్రమంలోనే ఆపరేషన్ సిందూర్, ప్రజెంట్ సిట్యుయేషన్స్ గురించి మాట్లాడుతూ పోస్ట్ పెట్టింది.

దిశ, ఫీచర్స్ : యాంకర్ రష్మీ గౌతమ్ కరెంట్ ఇష్యూస్‌పై స్పందించడంలో ముందుంటుంది. ఈ క్రమంలోనే ఆపరేషన్ సిందూర్, ప్రజెంట్ సిట్యుయేషన్స్ గురించి మాట్లాడుతూ పోస్ట్ పెట్టింది. ‘‘యుద్ధ సమయంలో శత్రువును కీర్తించడం.. సొంత నాయకుడిని విమర్శించడం.. అభిప్రాయం కాదు రాజద్రోహం’’ అని తెలిపింది. వంద శాతం ఇలాంటి పని చేయకూడదని చెప్పింది. సోషల్ మీడియాలో ఆపరేషన్ సిందూర్‌పై కొందరు ఇండియన్ సిటిజెన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో ఈ ట్వీట్ చేసింది.
అయితే దీనిపై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు.. వార్ గురించి అడిగితే తప్పేంటని ప్రశ్నించారు. దీనికి సమాధానమిచ్చిన ఆమె.. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ గురించి వెంటనే పూర్తి వివరాలు అందించడం సాధ్యం కాదని గుర్తుంచుకోవాలని, పైగా కొన్ని సీక్రెట్స్ మెయింటెన్ చేయాల్సిన అవసరముంటుందని తెలుసుకోవాలని చెప్పింది. కనీసం ఆలోచించకుండా సొంత దేశ నాయకులను విమర్శించడం కరెక్ట్ కాదని అభిప్రాయపడింది. ఇక రష్మి పోస్ట్‌కు తన అభిమానులు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.






