ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మారిన పబ్ కల్చర్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-12 12:44:00  IST  )

భారత్ పాక్‌పై వార్ ప్రకటించింది. ఆ దేశాన్ని చిత్తు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో సైనికులపై పూల వర్షం కురుస్తున్న వీడియోలు.. పెళ్లైన మూడు రోజులకే భర్తను బార్డర్‌కు పంపుతున్న

ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మారిన పబ్ కల్చర్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో
X

దిశ, ఫీచర్స్ : భారత్ పాక్‌పై వార్ ప్రకటించింది. ఆ దేశాన్ని చిత్తు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో సైనికులపై పూల వర్షం కురుస్తున్న వీడియోలు.. పెళ్లైన మూడు రోజులకే భర్తను బార్డర్‌కు పంపుతున్న భారత స్త్రీ ధీరత్వం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సామాన్య ప్రజలు ఇలాంటి వీడియోలు చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. మరీ జెన్ జెడ్ ఏం చేస్తుంది? పబ్‌ల్లో ఎంజాయ్ చేస్తుందా? అంటే... నో నో అక్కడ కూడా దేశభక్తితో ఉప్పొంగిపోతుంది.

పూణేకు చెందిన ఓ బార్‌లో సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పబ్‌కు వెళ్లిన యువకులు.. మందు సేవిస్తూ.. డ్యాన్స్ చేస్తూ.. ఎంజాయ్ చేయడం కాదు.. ఉరి సినిమాలోని గూస్ బంప్స్ తెప్పిచ్చే సీన్స్‌తో యువకుల నరాల్లోకి దేశభక్తిని ఎక్కించే ప్రయత్నం చేస్తోంది. తాము కూడా బార్డర్‌కు వెళ్లి యుద్ధం చేసేంత పాట్రియాటిజాన్ని నింపుతుంది. అయితే ఈ వీడియో చూసిన కొందరు పాజిటివ్‌గా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం నెగెటివ్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఓ వైపు యుద్ధం జరుగుతుంటే బార్‌లో ఏం చేస్తున్నారని తిట్టిపోస్తున్నారు.

Next Story