Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్‌’ టైటిల్‌తో సినిమా.. పవర్ ఫుల్ పోస్టర్ షేర్ చేస్తూ డైరెక్టర్ కీలక ప్రకటన

by Gugulothu.Kavitha |

జమ్మూకశ్మీర్‌(Jammu&Kashmir)లో పహల్గామ్(Pahalgam Attack) వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపిన విషయం తెలిసిందే.

Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్‌’ టైటిల్‌తో సినిమా.. పవర్ ఫుల్ పోస్టర్ షేర్ చేస్తూ డైరెక్టర్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్‌(Jammu&Kashmir)లో పహల్గామ్(Pahalgam Attack) వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యావత్‌ భార‌త్ భగ్గుమంది. దీంతో ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌(Pakisthan)పై భారత్ ప్రతీకారం తీర్చుకోవాల‌ని సర్వత్రా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో భార‌త సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) పేరిట పాక్‌ ఉగ్రమూకలపై విరుచుకుపడింది. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం పీవోకే (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌)తో పాటు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న తొమ్మిది కీలక ఉగ్ర స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసింది.

అలాగే భారత్ పాకిస్తాన్ దాడులను దీటుగా ఎదుర్కొంటు దెబ్బ కొడుతుంది. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సినిమా అనౌన్స్ అయింది. ఇక ఈ చిత్రానికి ఉత్తమ్ నితిన్(Uttam Nithin) దర్శకత్వం వహిస్తుండగా.. నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్, ది కంటెంట్ ఇంజినీర బ్యానర్లు నిర్మించనున్నాయి. అయితే తాజాగా ఆపరేషన్ సిందూర్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ పోస్టర్‌‌ను గమనించినట్లయితే.. ఓ మహిళ సైనికురాలు ఓ చేతిలో గన్ పట్టుకొని ఉండగా.. మరో చేత్తో నుదిటిపై సిందూర్ పెట్టుకుంటున్నారు.

అలాగే ఆ సైనికురాలు ముందు యుద్ధ ట్యాంకర్లు, రగులుతున్న మంటలు ఉన్నాయి. అయితే ఆ మహిళ ఫేస్‌ మాత్రం రివీల్ చేయలేదు. కాగా ఉద్రిక్తలు కొనసాగుతున్న తరుణంలో ఆపరేషన్ చిత్రాన్ని ప్రకటించడం సరికాదంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక దీనిపై దర్శకుడు ఉత్తమ్ వివరణ ఇచ్చాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టాడు. అందులో ‘ఎవరి సెంటిమెంట్లను రెచ్చగొట్టేందుకు, కించపరచడం నా ఉద్దేశం కాదు. మన దేశ సైనికులు, నాయకత్వం వీరత్వాన్ని, సామర్థ్యంపై సినిమా తీస్తున్నాము. అయితే ఇలాంటి టైంలో మూవీ ప్రకటించడం కొందరిని నొప్పించి ఉండవచ్చు, వారికి క్షమాపణ చెబుతున్నాను’ అని రాసుకొచ్చాడు.

Next Story