Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. కాంగ్రెస్ అధిష్టానం అత్యవసర సమావేశం

by Muthe.Rajitha |   (  Updated:2025-05-07 11:15:09  IST  )

పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్-పాక్ (Bharat-Pak)మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే.

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. కాంగ్రెస్ అధిష్టానం అత్యవసర సమావేశం
X

దిశ,వెబ్ డెస్క్ : పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack) నేపథ్యంలో భారత్-పాక్ (Bharat-Pak)మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. అనేక పరిణామాల అనంతరం భారత ఆర్మీ "ఆపరేషన్ సిందూర్"(Operation Sindoor) పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK) లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి.. 80 మంది ముష్కరులను అంతమొందించింది. భారత్ ఇచ్చిన ఈ మాస్టర్ స్ట్రోక్ తో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అత్యవసర భేటీ(AICC Meeting) అయింది.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేష్, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, సచిన్ పైలట్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పాకిస్తాన్, POKలోని ఉగ్రవాద స్థావరాలపై ఉక్కుపాదం మోపిన భారత భద్రతా బలగాలను చూసి గర్విస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

Next Story