- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor : మీకు నేనున్నా.. యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాలకు ‘Fittr’ భరోసా
Operation Sindoor : మీకు నేనున్నా.. యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాలకు ‘Fittr’ భరోసా

దిశ, ఫీచర్స్ : మనసుండాలె గానీ మార్గముంటుంది అంటారు పెద్దలు. సంపాదన ఉంటే సరిపోదు.. అవసరమైనప్పుడు మంచికోసం కూడా వినియోగించాలని భావిస్తుంటాయి కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు. ఫిట్టర్ ఫిట్టర్ (Fittr) సంస్థ, దాని స్థాపకుడు జితేంద్ర చౌక్సే ఈ కోవకే చెందుతారని చెప్పవచ్చు. ఎందుకంటే ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా దేశం కోసం పోరాడుతూ వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలకు(who sacrificed their lives during Operation Sindoor) ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది ఫిట్టర్. తమ స్టార్టప్ లాభాల్లో ఒక భాగాన్ని ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు కేటాయిస్తామంటూ జితేంద్ర చౌక్సే (Jitendra Choukse) ప్రకటించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆలోచింప చేస్తోంది. ఆయన దాతృత్వ గుణంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఫిట్టర్ (Fittr) అనేది వాస్తవానికి పర్సనలైజ్డ్ ఫిట్‌నెస్ (personalized fitness) ఫిట్‌నెస్, అలాగే పోషకాహార కార్యక్రమాలను అందించే ఒక ఆన్‌లైన్ వేదిక. 2016లో జితేంద్ర చౌక్సేతోపాటు మరో ముగ్గురు కలిసి దీనిని స్థాపించారు. ప్రధాన కార్యాలయం పూణెలో ఉంది. కాగా ప్రజలకు ఫిట్‌నెస్ అందించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడటం, ఫిట్‌నెస్ పరిశ్రమలో ఉద్యోగాలను క్రియేట్ చేయడం. హెల్తీ లైఫ్ స్టైల్‌ను సులభతరం చేయడం దీని ప్రధాన ఉద్దేశంగా ఆ సంస్థ పేర్కొన్నది. కాగా ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా వీరోచితంగా పోరాడుతున్న సైనిక కుటుంబాలను ఆదుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్న ఆ సంస్థ వ్యస్థాపకుడు జితేంద్ర చౌక్సే, తమ స్టార్టప్‌కు వచ్చే లాభాలలో ఒక భాగాన్ని కేవలం వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవడానికి విరాళంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫిట్టర్ లాంటి సంస్థలు విలువలను, దేశం పట్ల బాధ్యతను గుర్తు చేస్తున్నాయని, ఇతరులకు స్ఫూర్తినిస్తున్నాయని పలువురు ప్రశంసిస్తున్నారు.






