- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Operation Sindoor: మళ్లీ చెబుతున్నాం.. అంతే తీవ్రతతో దాడి చేస్తాం.. పాక్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ(Vikram Misri), కల్నల్ సోఫియా ఖురేషీ(Colonel Sophia Qureshi) కీలక అప్డేట్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ(Vikram Misri), కల్నల్ సోఫియా ఖురేషీ(Colonel Sophia Qureshi), వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్(Vyomika Singh) కీలక అప్డేట్ ఇచ్చారు. గురువారం సాయంత్రం వారు మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాకిస్తాన్(Pakistan) సైనిక స్థావరాలను టార్గెట్ చేయలేదని తాము చెప్పాం.. అయినా కూడా బుధవారం రాత్రి పశ్చిమ, ఉత్తర స్థావరాలపై పాకిస్తాన్ దాడికి ప్రయత్నం చేసింది. పాక్ మిస్సైల్ శిథిలాలు అనేక చోట్ల పడ్డాయి. దాదాపు దేశంలోని ఏడు ప్రాంతాల్లో పాక్ దాడికి యత్నించింది. పాక్ ఏ తీవ్రతతో దాడి చేసిందో తామూ అదే తీవ్రతతో ప్రతిదాడి చేశామని స్పష్టం చేశారు. పాక్ దాడులను ధీటుగా తిప్పికొట్టామని పేర్కొన్నారు. లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. దేశంలోని అనేక సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడుల తీవ్రతను పెంచింది. అవంతిపురా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపూర్‌తలా, లుథియానా, ఆదమ్‌పూర్, బటిండా, చండీగఢ్, నాల్, ఫలోదీ, ఉత్తర్‌లయ్, భుజ్ ప్రాంతాల్లో దాడులకు యత్నించిందని తెలిపారు.
ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాం(Pahalgam) దాడితో ఈ ఘటనలు మొదలయ్యాయి. దానికి భారత సైన్యం నిన్న(బుధవారం తెల్లవారుజామున) సమాధానం ఇచ్చింది. పెహల్గాంలో దాడులకు పాల్పడింది తామేనని TRF ప్రకటించింది. TRF అనేది లష్కరే తొయిబాకు అనుబంధ సంస్థ. సెక్యూరిటీ కౌన్సిల్‌లో TRF రద్దును పాకిస్తాన్ వ్యతిరేకించింది. మరోవైపు ఉగ్రవాదంతో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ చేతులు కడుక్కునే ప్రయత్నం చేస్తోంది. ఉగ్రదాడుల్లో పాకిస్తాన్ ప్రమేయం ఉందని అనేక సందర్భాల్లో రుజువైంది. భారత్‌తో పాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉగ్రమూకలు దాడులు చేశాయి. ఆ దాడులన్నింటిలో పాక్ ప్రమేయం ఉందని విక్రమ్ మిస్రీ వెల్లడించారు. లాడెన్ ఎక్కడ దొరికాడో కూడా అందరికీ తెలుసు. ప్రత్యేకంగా గుర్తుచేయాల్సిన అవసరం లేదు. శాబ్దాలుగా భారత్‌లోకి పాక్ ఉగ్రవాదులను పంపుతోంది. అంతర్జాతీయ సమాజానికి మాత్రం తమకేం సంబంధం లేనట్లు తప్పుడు సమాచారం ఇస్తోందని అన్నారు. పఠాన్‌కోట్ దాడుల విచారణకు పాక్ బృందానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఉగ్రవాదుల DNA, రికార్డులు, వాళ్ల అడ్రస్సులు అందించినట్లు చెప్పారు. నిత్యం ఎల్‌వోసీలో పాక్ పాల్పులకు తెగబడుతోంది. సరిహద్దుల్లో ఇప్పటివరకు 16 మంది భారత పౌరులు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. మరింత కవ్వింపు చర్యలకు దిగితే.. తామూ అదే రీతిలో సమాధానం ఇస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు పాకిస్తాన్‌పై భారత్(India) డిజిటల్ యుద్ధం(Digital War) కూడా మొదలెట్టింది. పాడ్‌కాస్ట్‌లు, ఓటీటీలు, వెబ్‌సిరీస్‌లు సినిమాలు(Pakistani Movies), ఆ సినిమాల పాటలపై నిషేధం విధించింది. జాతీయ భద్రత దృష్ట్యా తక్షణమే అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.






