- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
India-Pak War:పాకిస్తాన్ ట్రాప్‌లో భారత జర్నలిస్టులు.. అసలు విషయమేంటంటే?
పహల్గం ఉగ్రదాడి ఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: పహల్గం ఉగ్రదాడి ఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. పాకిస్తాన్ ఉగ్రమూకల స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో మెరుపు దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో పాక్ సైనికులు చేస్తున్న డ్రోన్స్, మిసైల్ దాడులను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది. వాటిని ఎక్కడికక్కడ ధ్వంసం చేసి శిథిలాలను స్వాధీనం చేసుకుంది. ఈ తరుణంలో వారం రోజులు భారత్–పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో సరిహద్దుల్లో వాతావరణం కాస్త ప్రశాంతంగా మారింది.
ఈ నేపథ్యంలో పాక్ తమ కుటిల బుద్దిని ప్రదర్శిస్తునే ఉంది. కాల్పుల విరమణ అనంతరం పలు ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు పంపిందని వార్తలు వచ్చాయి. ఇక ప్రస్తుతం పాక్ మరోసారి వక్రబుద్ది చూపట్టేబోతుందాని ప్రచారం జరుగుతోంది. విషయం ఏమిటంటే.. భారత జర్నలిస్టులకు పాక్ గూఢచారులు వల విసిరినట్లు సమాచారం. తాము భారత్ రక్షణ శాఖ అధికారులుగా పేర్కొంటూ పాక్ మద్ధతుదారులు జర్నలిస్ట్‌లకు ఫోన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించి సైనిక అధికారులు ఇచ్చే బ్రీఫింగ్ సమాచారం సేకరిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం పై భారత అధికారులు స్పందిస్తే గానీ ఇందులో నిజమెంతో తెలియదు.






