ఇక్కడ భారత ఆర్మీ ఉంది.. మాకు ఏ భయం లేదు: జైసల్మేర్‌, జమ్ము ప్రజలు

by Malleboina Mahesh |   (  Updated:2025-05-09 03:50:17  IST  )

కశ్మీర్ ఉగ్రదాడికి కౌంటర్ గా భారత వాయుసేన పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత్ ఉగ్రవాదులపై దాడి చేసి.. 100 మంది టెర్రరిస్టులను హతమార్చింది.

ఇక్కడ భారత ఆర్మీ ఉంది.. మాకు ఏ భయం లేదు: జైసల్మేర్‌, జమ్ము ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్: కశ్మీర్ ఉగ్రదాడికి కౌంటర్ గా భారత వాయుసేన పాకిస్తాన్ (Pakistan) లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత్ (India) ఉగ్రవాదులపై దాడి చేసి.. 100 మంది టెర్రరిస్టులను హతమార్చింది. దీన్ని సహించలేని పాకిస్థాన్ భారత్‌తో కయ్యానికి కాలు దువ్వింది. దాదాపు 15 నగరాలను టార్గెట్ చేస్తూ మిస్సైల్స్, డ్రోన్ల దాడి చేసింది. ఇందులో మొదటగా రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్‌‌పై పాక్ డ్రోన్లు, మిస్సైల్స్ దాడి చేసింది. కానీ అప్రమత్తంగా ఉన్న భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టం.. పాక్ ప్రయోగించిన అన్ని మిస్సైల్స్, డ్రోన్లను విజయవంతంగా నిర్వీర్యం(అడ్డుకుంది) చేసింది.

కాగా జైసల్మేర్‌ ప్రాంతంలో నైట్ మొత్తం యుద్ద వాతావరణం (War atmosphere) నెలకొనగా.. తెల్లవారుజామునకు పరిస్థితి మెరుగు పడింది. దీంతో స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి భారత ఆర్మీకి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక ప్రజలు మీడియాతో మాట్లాడుతూ.. "పాకిస్తానీ డ్రోన్లన్నీంటిని భారత ఆర్మీ దీటుగా ఎదురుకుంది. ఆర్మీ రాకతో ప్రజలలో శాంతి నెలకొంది. ప్రస్తుతం ఇక్కడ ఆర్మీ ఉంది.. మాకు ఎటువంటి భయం లేదు. మేము భారత వైమానిక దళం, సైన్యంతో ఉన్నాము. మేము పేలుళ్ల శబ్దాలు విన్నాము, కానీ భూమిపై ఏ పేలుళ్లు జరగలేదు" అని ఒక స్థానికుడు చెప్పాడు.

అలాగే జమ్మూలోని ఒక స్థానికుడు కూడా స్పందిస్తూ.. "నిన్న రాత్రి మేము భోజనం ప్రారంభించిన వెంటనే, కొన్ని పేలుళ్ల శబ్దం వినిపించింది. తెల్లవారుజామున 4:30 గంటలకు మళ్ళీ పేలుళ్లు వినిపించాయి. భారత దళాలు (Indian forces) వాటిని కూడా ఎదుర్కొన్నాయి. తాము ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. భగవతి వైష్ణో దేవి జమ్మూ లో కూర్చొని మమ్మల్ని కాపాడుతున్నట్లుంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. పౌరులపై దాడి చేయడం పిరికితనం తప్ప మరొకటి కాదు ఎందుకంటే వారికి (పాకిస్తాన్) మన దళాలతో పోరాడే ధైర్యం లేదు. వారు చేయగలిగింది ఇదే. భారత దళాలు తగిన సమాధానం ఇస్తున్నాయి. మేము వారి పట్ల గర్వపడుతున్నాము అని చెప్పుకొచ్చాడు.

Next Story