భారత్-పాక్ యుద్ధం.. మరోసారి చైనా కీలక వ్యాఖ్యలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-10 06:02:27  IST  )

భారత్, పాకిస్థాన్ (India-Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి.

భారత్-పాక్ యుద్ధం.. మరోసారి చైనా కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో (Pahalgam attack) ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రవాదులు విచక్షణరహితంగా దాడి చేసి 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation sindoor) చేపట్టింది. సీమాంతర ఉగ్రవాదం అంతమొందించటమే లక్ష్యంగా 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేశారు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన పాకిస్థాన్.. భారత సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు పాల్పడుతోంది. అయితే, ఈ దాడులను భారత భద్రతా బలగాలు సమర్ధవంతంగా తిప్పికోడుతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.

ఇక భారత్, పాకిస్థాన్ (India-Pakistan) మధ్య నెలకొన్న తాజా పరిస్థితులపై ఇప్పటికే స్పందించిన పొరుగు దేశం చైనా (China).. శనివారం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఇరు దేశాలు కూడా శాంతియుత మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ సమస్యకు ముగింపు పలికేందుకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని పేర్కొంది. ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసే చర్యలకు పాల్పడకుండా రెండు దేశాలు సంయమనం పాటించాలని ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Next Story