- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యుద్ధం గురించి.. పిల్లలతో ఏం మాట్లాడాలి.?
ఏదో చెప్పేసి నోరు మూయించకుండాలి పిల్లలతో కూడా యుద్ధం గురించి మాట్లాడి.. డౌట్లను సాల్వ్ చేయాలి.

ఇప్పటి పిల్లలు చాలా షార్ప్.
లచ్చతొంబై డౌట్లుంటాయి వాళ్లకు.
వాళ్లకేం తెలుసులే అని మనం అనుకుంటాం కానీ..
వాళ్లకు యుద్ధం తెలుసు.. మిసైల్స్ తెలుసు.. పీవోకే కూడా తెలుసు.
ఇంకా తెలుసుకోవాలనే ఆత్రుతలో..
ఏదో అడుగుతారు.
మనమేదో చెప్పేసి నోరు మూయించాలి అనుకుంటాం.
కానీ.. అలా కాదు.
యుద్ధం గురించి కూడా వాళ్లతో మాట్లాడి.. డౌట్లను సాల్వ్ చేయాలి.
- దిశ, ఫీచర్స్
భావోద్వేగ పరిపక్వత
దేశం ఏ పరిస్థితుల్లో ఉందో పిల్లలకు చెప్పడం ముఖ్యం. కానీ ఎలా చెప్పాలన్నదే కీలకం. తల్లిదండ్రులు మొదట తమ పిల్లల భావోద్వేగ పరిపక్వతను అంచనా వేయాలి. ఆ తర్వాత ఎంత మేరకు పంచుకోవాలో నిర్ణయించుకోవాలి. దీనివల్ల "పిల్లలు మన చుట్టూ జరుగుతున్న విషయాలను ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారో తెలుస్తుంది. అయితే పిల్లల వయసును బట్టి సంభాషణలు ఉండాలి. 4–10 ఏళ్ల వయసు వారికి ఒక విధంగా.. 11–18 ఏళ్ల వయసు వారికి ఒక విధంగా చెప్పాల్సి ఉంటుంది.
సమాచార మూలం
యుద్ధం వంటి సున్నిత అంశాల గురించి పిల్లలు అడిగితే దాటవేయొద్దు. వారు చెప్పేది మొదట వినాలి. "ఈ విషయం గురించి ఎక్కడ విన్నావు.? ఎవరు చెప్పారు.? వీడియోలో చూశావా.? లేక స్నేహితులెవరైనా చెప్పారా.? వంటివి అడిగితే వాళ్లకు తెలిసిన విషయమొక్కటే కాకుండా.. అదెలా తెలుుసుకున్నారో కూడా అర్థమవుతుంది. చూడటానికి చిన్న ప్రశ్నలే కావచ్చు. కానీ చాలా విషయాలు తెలుసుకోవచ్చు. సాధారణంగా పిల్లలు స్నేహితుల ద్వారా సగం సగమే తెలుసుకుంటారు. కాబట్టీ మూలం తెలుసుకోవడం ఉత్తమం.
ప్రశాంతంగా ఉండాలి
పిల్లలు తల్లిదండ్రుల భావోద్వేగాలను ప్రతిబింబిస్తారు. పేరెంట్స్ ఆందోళనగా లేదా ఒత్తిడిలో కనిపిస్తే పిల్లలు వాటిని గ్రహిస్తారు. అందుకే మొదట తమను తాము స్థిరపరచుకోవడం చాలా ముఖ్యం. సున్నితమైన అంశాల గురించి పిల్లలతో మాట్లాడే ముందు ప్రశాంతంగా ఉండాలి. పేరెంట్స్ ప్రశాంతంగా.. ఆత్మవిశ్వాసంతో ఉన్నారని భావిస్తే సగం పని పూర్తవుతుంది. ఇది వారిని సేఫ్టీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది యుద్ధం వంటి విషయాలు చర్చించేటప్పుడే కాదు. ఇంట్లో రెగ్యులర్ యాక్టివిటీస్‌కు కూడా వర్తిస్తుంది.
ఆందోళన తగ్గించాలి
అనిశ్చిత సమయాల్లో పిల్లలు ఆందోళనగా లేదా అస్థిరంగా ఉంటారు. సంఘర్షణ లేదా అత్యవసర పరిస్థితుల గురించి వారితో చర్చించాల్సి వచ్చినప్పుడు వారిలో కనిపించే ఆందోళన.. భయాలను గమనించవచ్చు. కాబట్టీ యోగా.. ధ్యానం వంటివి అలవర్చాలి. అంటే ప్రశాంత కార్యకలాపాల్లో పాల్గొనేలా చూడాలి. బ్రీత్ ఎక్సర్‌సైజ్ పిల్లల్లో ఆందోళనను తగ్గించి వారిలో ఉండే సృజనాత్మక వ్యక్తీకరణ ఉత్తమంగా పనిచేస్తుంది. అన్నింటికంటే భరోసా కీలకం. వారితో చర్చించేటప్పుడు ప్రతీది నియంత్రణలో ఉంది చెప్పడం మంచిది.
ఏం అడిగితే.. ఏం చెప్పాలి.?
ప్రశ్న: "యుద్ధం జరుగబోతుందా.?"
సమాధానం: "ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇప్పుడు రెండు దేశాల్లోనూ దీనిని నివారించడానికి కఠినంగా పనిచేస్తున్న ఆర్మీ ఉంది. వాదనల మాదిరిగానే ఇది భయంగా కనిపించొచ్చు. కానీ పెద్దలు దానిని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు" అని చెప్పాలి.
ప్రశ్న: "మనం సురక్షితంగా ఉంటామా.?"
సమాధానం: అవును. మనం ఇప్పుడు సురక్షితంగానే ఉన్నాం. కొంచెం భయపడటం సరే. కానీ ప్రభుత్వం.. సాయుధ దళాలు అందర్నీ రక్షించడానికి ప్రణాళికలు వేస్తున్నారు. నేను కూడా నీతోనే ఉంటాను కదా" అనాలి.
ప్రశ్న: "యుద్ధం చేస్తేనే పరిష్కారం ఉంటుందా.?"
సమాధానం: "కొన్నిసార్లు వ్యక్తులు లేదా దేశాలు కూడా ఏది సరైందో దాని గురించి పెద్ద విభేదాలు కలిగి ఉంటాయి. ఇది సంక్లిష్టమైనది. కానీ లక్ష్యం ఎల్లప్పుడూ శాంతియుత పరిష్కారం దిశగానే వెళ్లాలి" అని వివరించాలి.
- Tags
- Kids
- War
- Parents
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation






