మా తాతల నుంచి ఆర్మీలోనే.. కల్నల్ సోఫియా తండ్రి కామెంట్స్ వైరల్

by velandi.Saikiran |

కల్నల్ సోఫియా ఖురేషి ( Colonel Sofia Qureshi) తండ్రి తాజ్ ఖురేషి ( Taj Qureshi) ఆసక్తి కర కామెంట్స్ చేశారు. నా కూతురిని

మా తాతల నుంచి ఆర్మీలోనే.. కల్నల్ సోఫియా తండ్రి కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: కల్నల్ సోఫియా ఖురేషి ( Colonel Sofia Qureshi) తండ్రి తాజ్ ఖురేషి ( Taj Qureshi) ఆసక్తి కర కామెంట్స్ చేశారు. నా కూతురిని చూసి గర్విస్తున్నా.. కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి తాజ్ ఖురేషి అంటూ వ్యాఖ్యానించారు. మా తాతల నుంచి ఆర్మీలోనే ఉంటున్నామని తెలిపారు. దేశం కోసం నా కూతురు చేసిన మంచి పనికి నేను ఎంతో గర్విస్తున్నానని పేర్కొన్నారు. ఒకవేళ నాకు ఇప్పుడు అవకాశం వస్తే.. ఆ పాకిస్తాన్‌ను నాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చారు కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి తాజ్ ఖురేషి.

అసలు ఈ భూమి మీద ఉండే అర్హత ఆ దాయాది దేశానికి లేనే లేదన్నారు. మా తాత, తండ్రితో పాటు నేను కూడా భారత ఆర్మీలో (Indian Army ) సేవలు అందించామని గుర్తు చేశారు. ఇప్పుడు నా కూతురు ఆర్మీలో ఉందంటూ గర్వంగా చెప్పారు తాజ్ ఖురేషి. దింతో మతం కాదు.. దేశ భద్రతే కర్తవ్యమని దేశభక్తిని ఖురేషి ఫ్యామిలీ చాటిందని అంటున్నారు. కాగా పాకిస్తాన్ పై జరిగిన ఆపరేషన్ సిందూర్ లో ముస్లిం మహిళ సైనిక్ అధికారి సోఫియా ఖురేషి కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా, ఆపరేషన్ సిందూర్ లో ( Operation Sindoor ) 100 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు మృతి చెందారు.

Next Story