operation sindoor: భారత సరిహద్దులో ఓ పోస్టుకు ‘సిందూర్‌’ పేరు!

by Prasad Jukanti |

ఆపరేషన్ సిందూర్ విషయంలో బీఎస్ఎఫ్ కీలక నిర్ణయం తీసుకుంది.

operation sindoor: భారత సరిహద్దులో ఓ పోస్టుకు ‘సిందూర్‌’ పేరు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. యావత్ దేశమంతటా మరోసారి ఈ ఆపరేషన్ భావోద్వేగాన్ని రలగిలించింది. దేశంలోని మనమంతా ఒక్కటిగా ఉంటూ శత్రువులకు మన ఐక్యత ఏంటో చూపించేలా చేసింది. ఇటువంటి ఈ ఆపరేషన్ సిందూర్ విషయంలో బీఎస్ఎఫ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆపరేషన్ లో భారత సైన్యం చూపిన తెగువకు గుర్తుగా సాంబా సెక్టార్ లోని ఓ పోస్టుకు సిందూర్ అని పేరు పెట్టాలని భారత సరిహద్దు భద్రతా దళం (BSF) ప్రతిపాదించింది. అలాగే మే 10 సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో అమరులైన మరో ఇద్దరు పేర్లను కూడా సరిహద్దుల్లోని పోస్టుకు పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు బీఎస్ఎఫ్ ఐజీ జమ్మూ ఫ్రాంటియర్ శశాంక్ ఆనంద్ తెలిపారు.

Next Story