నిమ్స్ ఆస్పత్రిలో క్యాన్సర్ విభాగం ప్రారంభం

by  |
నిమ్స్ ఆస్పత్రిలో క్యాన్సర్ విభాగం ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో రూ. 18 కోట్లతో మేఘా కంపెనీ నిర్మించిన క్యాన్సర్ విభాగంను ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. పేద ప్రజలకు, ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు అందుబాటులో ఆధునిక వైద్యం అందించడం కోసం మేఘా కంపెనీ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే అత్యాధునిక సౌకర్యాలతో నిమ్స్‌లోని ఆంకాలజీ వార్డును ఏర్పాటు చేశారు. మొత్తం 50 గదుల పడకలతో క్యాన్సర్‌ పేషెంట్‌లకు ప్రత్యేక వార్డులు, పెషేంట్లకు అనుక్షణం సేవలందించేందుకు వార్డుల్లోనే నర్సింగ్ స్టేషన్లు ఉండేలా గదులను రూపొందించారు.

అనంతరం ఈటల మాట్లాడుతూ.. నిమ్స్‌ను తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా క్యాన్సర్ వైద్య పరీక్షల కోసం కొత్త పరీక్షలు తీసుకొచ్చామన్నారు. ఎంత టెక్నాలజీ వచ్చిన విపత్తు వస్తే తట్టుకోలేమని కరోనా నిరూపించిందని గుర్తు చేసిన ఈటల.. ప్రజారోగ్యం కోసం ఎన్ని కోట్లయిన ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు.


Next Story

Most Viewed