దేశంలో ఐదుగురిలో ఒకరికి ఉద్యోగం లేదు

by  |
దేశంలో ఐదుగురిలో ఒకరికి ఉద్యోగం లేదు
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వల్ల ఎంతోమందికి ఉపాధి లేకుండా పోయిందన్నది కాదనలేని వాస్తవం. రోజూ ఎన్నో కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్న వైనాన్ని చూస్తూనే ఉన్నాం. కరోనా సంక్షోభంతో ఎన్నో చిన్న వ్యాపార సంస్థలు తమ వ్యాపారాన్ని కొనసాగించలేక ఎంతోమంది ఉద్యోగుల్ని రోడ్డున పడేశాయి. కొవిడ్ ప్రబలడంతో మార్చి 25న కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. అలా మెల్లమెల్లగా ఆంక్షలు సడలిస్తూ జూన్ 1కి అన్‌లాక్ చేసింది. లాక్‌డౌన్ సడలించిన తర్వాత దేశంలో నిరుద్యోగిత ఎలా? ఎంతమందికి జాబ్ లేకుండా పోయింది? ఈ విషయాలను తెలుసుకోవడానికి ఐఏఎన్ఎస్-సీఓటర్-కొవిడ్ 1,723 మందిపై సర్వే చేసింది.

ఆ సర్వే ప్రకారం..లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత ప్రతి ఐదుగురిలో ఒకరు నిరుద్యోగిగా మారారు. 21.57 శాతం మంది ప్రజలు పూర్తిగా నిరుద్యోగులుగా మారారు. లేదా అసలు పనిలేకుండా పోయింది. 25.92 శాతం మంది ఇప్పటికీ పాత జీతంతో పాటు.. కంపెనీ రెగ్యులేషన్స్, సేఫ్టి మెజర్స్ కింద పనిచేస్తున్నారని, 8.09 శాతం మంది జీతం తగ్గించుకొని వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్నారని సర్వే తెలిపింది. ఈ సర్వే జూన్ 24 నుంచి జూలై 22 వరకు మధ్య జరిగింది. ఈ సర్వే ప్రకారం 8.33 శాతం మంది ప్రజల ఆదాయం తగ్గింది. అంతేకాదు శాలరీ కటింగ్స్ పెరిగాయని తేలింది. లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత దేశంలో 6.12 శాతం మందికి ఆదాయం లేదని, 1.20 శాతం మంది ఉద్యోగం చేస్తున్నా జీతం మాత్రం లభించడం లేదని సర్వే వివరించింది.

Next Story