- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తనువు చాలించిన అవ్వ.. ఆమె బిడ్డలెవ్వరో?
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: కన్నుమూసిన ఓ అవ్వను చూడ్డానికి కొడుకులు, కూతుళ్లు రాలేదు. తన బిడ్డలను కడసారి చూసేందుకు ఆ అవ్వ ఎంత తపించిందో వర్ణానాతీతం. కానీ, చివరకు ఆమె ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ హృదయవిధారక ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. తీవ్ర అనారోగ్యంతో ఖానాపూర్ ప్రభుత్వ హాస్పిటల్‌లో ఓ వృద్ధురాలు అడ్మిట్ అయింది. అయితే, డాక్టర్లు చికిత్స చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే మృతి చెందింది. ఆమె ఎవరో వివరాలు […]</p>

X
దిశ, ఆదిలాబాద్: కన్నుమూసిన ఓ అవ్వను చూడ్డానికి కొడుకులు, కూతుళ్లు రాలేదు. తన బిడ్డలను కడసారి చూసేందుకు ఆ అవ్వ ఎంత తపించిందో వర్ణానాతీతం. కానీ, చివరకు ఆమె ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ హృదయవిధారక ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. తీవ్ర అనారోగ్యంతో ఖానాపూర్ ప్రభుత్వ హాస్పిటల్‌లో ఓ వృద్ధురాలు అడ్మిట్ అయింది. అయితే, డాక్టర్లు చికిత్స చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే మృతి చెందింది. ఆమె ఎవరో వివరాలు మాత్రం తెలియకపోవడం బాధాకరం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలి వివరాలపై ఆరా తీస్తున్నారు.
Next Story






