- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి వృద్ధురాలిని హత్య చేసి..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలో వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ మర్డర్ జరిగింది. పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ వాసు తల్లి ఇందిరమ్మ కాలనీ ఫేజ్-2లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని గొంతు కోసి హత్య చేశారు. ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారం, 20 తులాల వెండిని దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలో వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ మర్డర్ జరిగింది. పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ వాసు తల్లి ఇందిరమ్మ కాలనీ ఫేజ్-2లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని గొంతు కోసి హత్య చేశారు. ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారం, 20 తులాల వెండిని దోచుకెళ్లారు.
సమాచారం అందుకున్న పోలీసులు హత్యాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీంతో హతురాలి ఇంట్లో ఆధారాలు సేకరించారు. అయితే హత్యకు పాల్పడింది పాతనేరస్తులా.. కొత్తవారా అని పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు హత్య జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ కోసం అన్వేషిస్తున్నారు.
Next Story






