పట్టించుకోని అధికారులు.. ప్రజలకు శాపంగా మారిన బ్రిడ్జ్ (వీడియో)

by  |
పట్టించుకోని అధికారులు.. ప్రజలకు శాపంగా మారిన బ్రిడ్జ్ (వీడియో)
X

దిశ, కొత్తగూడెం : జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో అభివృద్ధి ఉరకలు వేస్తుంటే అండర్ బ్రిడ్జ్ మాత్రం ప్రజలకు శాపంగా మారింది. కొత్తగూడెం నుంచి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న ఈ అండర్ బ్రిడ్జ్ తేలికపాటి వర్షాలకే చెరువును తలపిస్తోంది.

మోస్తారుకు మించి కాస్త అధిక వర్షపాతం నమోదు అయితే చాలు రాకపోకలు పూర్తిగా స్తంభించే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతీ ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు పట్టణ ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. అండర్ బ్రిడ్జ్‌లో నిలిచిన నీరు బయటికి వెళ్లడానికి సరైన ఇంజనీరింగ్ పరిజ్ఞానం ఉపయోగించకపోవడంతో వర్షాలకు వచ్చి చేరిన నీరు బయటకి వెళ్లడానికి సరైన డ్రైనేజీ సిస్టం లేదు.

దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతీ ఏటా మరమత్తు పేరుతో లక్షలు ఖర్చు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. అండర్ బ్రిడ్జ్ మరమ్మత్తు చేయకపోవడంతో మోకాళ్ళ లోతు గుంతలు పడి ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

Next Story

Most Viewed