పూరీ రథయాత్రకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

by Shamantha N |   (  Updated:2020-06-22 07:54:19  IST  )

<p>భువనేశ్వర్: తగు జాగ్రత్తలతో పూరీ జగన్నాథుడి రథ యాత్ర నిర్వహిస్తామని ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. పూరీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చైర్మెన్ గజపతి మహారాజ్ ప్రతిపాదనల మేరకు ఈ రథయాత్రను కేవలం పూరి జిల్లాకే పరిమితం చేస్తామని, అదికూడా ప్రజల హాజరు లేకుండానే నిర్వహిస్తామని తెలిపింది. ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు తెలిపింది. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పూరి జగన్నాథుడి యాత్ర నిర్వహించవద్దని సుప్రీంకోర్టు ఇటీవలే సూచించిన సంగతి తెలిసిందే. [&hellip;]</p>

పూరీ రథయాత్రకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
X

భువనేశ్వర్: తగు జాగ్రత్తలతో పూరీ జగన్నాథుడి రథ యాత్ర నిర్వహిస్తామని ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. పూరీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చైర్మెన్ గజపతి మహారాజ్ ప్రతిపాదనల మేరకు ఈ రథయాత్రను కేవలం పూరి జిల్లాకే పరిమితం చేస్తామని, అదికూడా ప్రజల హాజరు లేకుండానే నిర్వహిస్తామని తెలిపింది. ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు తెలిపింది. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పూరి జగన్నాథుడి యాత్ర నిర్వహించవద్దని సుప్రీంకోర్టు ఇటీవలే సూచించిన సంగతి తెలిసిందే. ఈ సూచనలకు కట్టుబడి ఉంటామని ఒడిశా ప్రభుత్వమూ అంగీకరించింది. కానీ, ఆ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని పలుపిటిషన్లు దాఖలవడంతో సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం మళ్లీ విచారించింది. తాజా విచారణలో పురి జగన్నాథుడి రథయాత్రపై నిర్ణయాన్ని ఒడిశా ప్రభుత్వ అభీష్టానికే వదిలిపెట్టినట్టు పేర్కొంది. కాగా, ఈ రథయాత్ర కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు సంబంధించినదని, కాబట్టి రథయాత్రకు అనుమతినివ్వాలని సుప్రీంకోర్టును పిటిషనర్లు అభ్యర్థించారు. ఇప్పుడు జగన్నాథుడు బయటికి రాకుంటే సంప్రదాయాల ప్రకారం 12 ఏళ్లు బయటికి రాడని కేంద్రం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా తెలిపారు.

Next Story