- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరిహద్దులో పెరిగిన ఉద్రిక్తత
పహల్గామ్ ఘటనలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి.. సరిహద్దులకు తరిలిన ఇరు దేశాల బలగాలు.

పహల్గామ్ ఘటనతో భారత్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరు దేశాల సైన్యాలు భారీగా బలగాలను మోహరిస్తున్నాయి. ఇప్పటికే పహల్గామ్ పరిసర ప్రాంతాలను సైన్యం అణువణువూ గాలిస్తున్నది. ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులు.. సరిహద్దులకు చేరాలంటే కనీసం ఆరు, ఏడు గంటల సమయం పడుతుందని ఈలోగానే వారిని పట్టుకుంటామని సైన్యం స్పష్టం చేస్తున్నది. కశ్మీర్ లో ఉన్న ప్రతి సైనికుడు ఉగ్రవాదులను పట్టుకోవడంలోనే నిమగ్నమై ఉన్నాడని సైనిక అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఘటన నేపథ్యంలో పాక్ ఆర్మీ అప్రమత్తమైంది. భారత్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు చోటుచేసుకున్నా.. తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తామని పాక్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల సైనిక బలగాలు భారీ ఎత్తున సరిహద్దులకు చేరుకోవడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మరోవైపు సరిహద్దుల్లోని గ్రామాల ప్రజలను ముందు జాగ్రత్త చర్యగా సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది.






