Viral Video: నిన్న ఇది గమనించారా?.. లోక్ సభలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం వేళ ముస్లిం మహిళలు ఏం చేశారో తెలుసా?

by Vennela |

Waqf Bill: దేశ వ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లు హాట్ టాపిగ్గా మారిన సంగతి తెలిసిందే.

Viral Video: నిన్న ఇది గమనించారా?.. లోక్ సభలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం వేళ ముస్లిం మహిళలు ఏం  చేశారో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: Waqf Bill: దేశ వ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లు హాట్ టాపిగ్గా మారిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు కొందరు మద్దతిస్తుంటే..మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు జేడియూ, జెడీఎస్, టీడీపీ వంటి పార్టలు తమ మద్దతు ప్రకటించాయి. ప్రతిపక్ష కూటమి బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ కాంగ్రెస్ అభివర్ణించింది. బిల్లును వ్యతిరేకిస్తామని ఎస్పీ కూడా అంటోంది. అయితే ఓ వైపు లొల్లి జరుగుతుండగానే..కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును లోకసభలో ప్రవేశపెట్టింది.

ఈ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సభ ముందుకు తీసుకువచ్చారు. ఇది ఆస్తికి సంబంధించిన విషయం అన్నారు. మేము బిల్లును విశాల ద్రుక్పథంతోనే ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ బిల్లు మత వ్యవస్థలో జోక్యం చేసుకోదన్నారు. ఈ తరుణంలోనే ఢిల్లీ, భోపాల్ లోని ముస్లి మహిళలు వక్ఫ్ సవరణ బిల్లుకు తమమద్దతు ప్రకటించారు. మోదీ జీ మీరు పోరాడండి...మేము మీతోనే ఉన్నాము అంటూ వీధుల్లోకి వచ్చి నినదించారు.

ఢిల్లీ, భోపాల్ నుంచి విభిన్నమైన మద్దతు లభించింది. ఇక్కడి ముస్లిం మహిళలు వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతుగా ముందకు వచ్చారు. పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు ప్రధాని మోదీకి మద్దతుగా ప్లకార్డులను పట్టుకుని నినాదాలు చేశారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. వక్ఫ్ ఆస్తి ఆదాయాన్ని దాని నిజమైన యజమానికి అందించినందుకు వక్ఫ్ బోర్డులో మహిళలు, వెనకబడిన ముస్లింలకు వాటా ఇచ్చినందుకు మోదీజీ ధన్యవాదాలు అని తెలిపారు.



Next Story