- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిడ్నీలో కారు ప్రమాదం.. 8నెలల భారతీయ గర్భిణీ మహిళ మృతి
సిడ్నీలోని హార్న్స్ బై శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది నెలల గర్భవతి అయిన భారతీయ సంతతికి చెందిన మహిళ మరణించింది. అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం..

దిశ, వెబ్ డెస్క్: సిడ్నీలోని హార్న్స్ బై శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది నెలల గర్భవతి అయిన భారతీయ సంతతికి చెందిన మహిళ మరణించింది. అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం... 33 ఏళ్ల సమన్విత ధరేశ్వర్, తన భర్త మరియు మూడేళ్ల కొడుకుతో కలిసి జార్జ్ స్ట్రీట్ ప్రాంతంలో రోడ్డు దాడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు కియా కారును ఢీ కొట్టింది.
కియా కారు రోడ్డు దాటుతున్న సమన్వితను ఢీ కొట్టడంతో తీవ్రగాయాలై మరణించింది. సమన్విత కడుపులోని బిడ్డ కూడా ప్రమాదం తరవాత మరణించింది. కాగా బీఎండబ్ల్యూ కారును 19ఏళ్ల మైనర్ నడిపినట్టు పోలీసులు చెబుతున్నారు. మహిళ రోడ్డు దాటుతుండగా కియా కారు డ్రైవర్ నెమ్మదిగా వెళ్లగా వెనకనుండి బీఎండబ్ల్యూ అతి వేగంగా ఢీ కొట్టిందని తెలిపారు. కియా కారు డ్రావర్ కు కూడా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడైన మైనర్ ను అదుపులోకి తీసుకున్నారు.






