- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
USA: చికాగో నగరంలో బీఆర్‌ఎస్ సభ
బీఆర్ఎస్(BRS) నేతలు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపడమే లక్ష్యంగా విదేశాల్లో పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించతలపెట్టిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేతలు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపడమే లక్ష్యంగా విదేశాల్లో పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించతలపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే అమెరికాలోని లాస్ ఏంజెలిస్, కాలిఫోర్నియా, అట్లాంటా, జార్జియా, వాషింగ్టన్ డీసీ(Washington DC) వంటి నగరాల్లో సన్నాహక సమావేశాలు బీఆర్ఎస్ అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశాలకు తెలంగాణ నుంచి ప్రత్యేక అతిథిగా సీనియర్ నేత బాల్క సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక కార్యకర్తలు, ఎన్నారైలతో మాట్లాడారు. డల్లాస్ ఈవెంట్ తాలూకు సమన్వయం, లాజిస్టిక్స్, రవాణా వంటి ఏర్పాట్లపై దృష్టి సారించడంతో పాటు, సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం సోషల్ మీడియా ప్రచారం, సాంస్కృతిక కార్యక్రమాలు, మీడియా సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. బీఆర్‌ఎస్ యూఎస్ఏ సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశాలు అమెరికాలోని బీఆర్ఎస్ కార్యకర్తలు, మద్దతుదారుల్లో మరింత ఉత్సాహాన్ని కలిగించాయి.
మరిన్ని నగరాల్లో సమావేశాలు
రానున్న పదిహేను రోజుల్లో అమెరికాలోని ఇతర కీలక నగరాలు, రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ స్థానిక విభాగాలు సన్నాహక సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించాయి. న్యూజెర్సీ, బే ఏరియా (కాలిఫోర్నియా), చికాగో(Chicago), హ్యూస్టన్, డల్లాస్, న్యూయార్క్ వంటి నగరాల్లో ఈ సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు బీఆర్‌ఎస్ యుఎస్‌ఏ విభాగం వెల్లడించింది.






