- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NRI: అమెరికాకు ఎందుకొచ్చావ్.. నీ ఇండియాకు వెళ్లిపో.. ఓ భారతీయుడిపై అమెరికన్ జాతి వివక్ష వ్యాఖ్యలు
అమెరికాలో భారతీయులకు నిత్యం ఎక్కడో చోట వివక్ష ఎదురవుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికాలో భారతీయులకు నిత్యం ఎక్కడో చోట వివక్ష ఎదురవుతోంది. ప్రతి ఇద్దరిలో ఒకరు శరీర వర్ణం, ఇతర కారణాలతో వివక్షకు గురవుతున్నట్లు గతంలో పలు నివేదికలు వెల్లడించాయి. అమెరికా(America)లో జన్మించి పౌరసత్వం పొందినప్పటికీ భారతీయ (NRI) అమెరికన్లలో వివక్ష భావన ఎదురవుతూనే ఉన్నాయి. మరోవైపు అమెరికాలో నివసించే భారతీయులు వెళ్లిపోవాలని డిమాండ్ సైతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఉన్న ప్రకారం.. అప్పుడే కారు పార్క్ చేసి వస్తున్న భారతీయుడిని ఓ అమెరికన్ వీడియో రికార్డ్ చేస్తూ (Racist comments) జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. అమెరికాకు ఎందుకొచ్చావ్.. నీ ఇండియాకు వెళ్లిపో.. అంటూ అమెరికన్ మండిపడ్డాడు.
మా అమెరికాలో మీ భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు.. మీరు ఇక్కడ ఉండటం నాకు నచ్చట్లేదు, తిరిగి వెళ్లిపోండి.. అంటూ తీవ్ర విమర్శలు చేశాడు. మా దేశస్థులు మిమ్మల్ని భరించలేకపోతున్నామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇందంత వింటున్న భారతీయుడు సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఈ మధ్య అమెరికాలో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయని కామెంట్స్ పెడుతున్నారు. ఇలా అమెరికాలో అవస్థలు పడే బదులు ఇండియాకు వచ్చి ఏదైనా పని చేసుకోవచ్చు.. అని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.






