Currency Circulation : 17 శాతం పెరిగిన కరెన్సీ చలామణి!

by  |
Currency Notes
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్‌బీఐ(RBI) విడుదల చేసిన వార్షిక నివేదికలో.. దేశంలోని కరెన్సీ చలామణి(Currency Circulation) విలువ పరంగా 16.8 శాతం పెరిగినట్టు వెల్లడించింది. నోట్ల సంఖ్య పరంగా చూస్తే ఇది 7.2 శాతం పెరిగింది. కొవిడ్ కారణంగా ప్రజలు నగదును ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకుంటున్నారని నివేదిక తెలిపింది. 2019-20లో విలువ పరంగా ఈ వృద్ధి 14.7 శాతం, నోట్ల పరంగా 6.6 శాతంగా నమోదైనట్టు ఆర్‌బీఐ పేర్కొంది. ఇక, ఈ ఏడాది మార్చి చివరి నాటికి చెలమణిలో ఉన్న మొత్తం కరెన్సీలో రూ. 500, రూ. 2,000 నోట్ల విలువ మాత్రమే 85.7 శాతంగా ఉంది. గతేడాది ఇదే సమయంలో వీటి విలువ 83.4 శాతంగా ఉండగా, అత్యధికంగా రూ. 500 నోట్లు చలామణిలో ఉన్నాయి. మొత్తం చలామణిలో వీటి వాటానే 31.1 శాతం కాగా, రూ. 10 నోట్ల సంఖ్య 23.6 శాతంగా ఉంది. అదేవిధంగా, 2020-21లో దేశవ్యాప్తంగా మొత్తం 2,08,625 నకిలీ నొట్లు బయటపడినట్టు నివేదిక తెలిపింది. ఇందులో 96.1 శాతం నొట్లను బ్యాంకుల వారు, 3.9 శాతం నోట్లను ఆర్‌బీఐ గుర్తించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి తగ్గాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed