నోటీసులు ఇచ్చినా ఆగని అక్రమ నిర్మాణాలు

by  |
Reddy Enclave
X

దిశ, అల్వాల్ : అల్వాల్​ సర్కిల్​ పరిధిలో నిరాటకంగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. జీహెచ్​ఎంసీ అధికారులు సదరు నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చినా ఖాతరు చేయడం లేదు. పేదలు 50 గజాలలో ఇంటి నిర్మాణం చేపడితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లను కూల్చే టౌన్​ప్లానింగ్​ అధికారులు వ్యాపార సముదాయాల నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా ఎందుకు కూల్చడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రెడ్డిఎన్​క్లేవ్​ ప్రధాన రహదారిలో కడుతున్న కమర్షియల్​ కాంప్లెక్స్​కు రెండు నోటీసులు ఇచ్చినా నిర్మాణాన్ని ఆపడం లేదని స్థానికుల ఆరోపిస్తున్నారు.

ఇంటి నిర్మాణాలకన్న వ్యాపార సముదాయాల నిర్మాణాల పైనే నాల ఆక్రమణలు ఎక్కువ జరిగాయని స్థానికులు పేర్కొంటున్నారు. అల్వాల్​ సర్కిల్​ పరిధిలోని నాలాలు పరిశీలిస్తే ఆక్రమణలు ఎంతలా జరుగుతున్నాయో తెలుస్తుందన్నారు. ఇటీవల నాలాల పై వేసిన సబ్​కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అన్నివిషయాలు బయటకు వస్తాయని స్థానికులంటున్నారు. అధికారులు నోటీసులతోనే సరిపెడుతున్నారని, కానీ చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Next Story

Most Viewed