సుఖేష్ గుప్తాకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

40

దిశ, క్రైమ్ బ్యూరో: ఎంబీఎస్ జ్యువెలర్స్‌‌ అధినేత సుకేష్ గుప్తాకు ఈడీ కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రూ. 275 కోట్ల రూపాయల స్కాంలో ప్రధాన నిందితుడిగా సుకెష్ గుప్తా ఉన్న సంగతి తెల్సిందే. ఈ విషయంపై సుఖేష్ గుప్తాకు ఈడీ అధికారులు సమన్లు కూడా జారీ చేయగా, వీటిపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టులో సుఖేష్ గుప్తా పిటిషన్‌ దాఖలు చేశాడు. కానీ, హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిండంతో అప్పట్నుంచి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే, సుఖేష్ గుప్తా దుబాయ్‌లో తలదాచుకున్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో సుఖేష్ గుప్తాకు ఈడీ కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..