- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అంశం.. తేల్చిచెప్పిన కేంద్రం
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై లోక్‌సభలో కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలపై తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు. ఈ అంశంపై హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల దృష్ట్యా ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అంశమని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పారు. అయితే ఏపీకి ప్రత్యేక సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అలాగే విభజన చట్టంలో చాలా అంశాలు అమలయ్యాయని.. మిగతా అంశాల పూర్తికి సమయం ఉందని హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు.
Next Story