వరంగల్‌: సీఎం కేసీఆర్ పర్యటనలో మీడియాకు నో ఎంట్రీ.. ఇదేంటి..?

by Vadlamudi Anukaran |   (  Updated:2021-06-21 00:19:52  IST  )

<p>దిశ ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో కవరేజ్ కోసం వచ్చిన మీడియా సిబ్బందిని పోలీసులు అనుమతించడం లేదు. సీఎం పర్యటనను కవర్ చేసేందుకు మీడియా సిబ్బంది సుబేదారి ఆర్ట్స్ కళాశాల వద్దకు చేరుకున్నారు. ఇందుకోసం ముందు రోజు పాసులు కూడా తీసుకున్నారు. కళాశాలలో మీడియా కవరేజ్ వెహికిల్ పెట్టినా పోలీసులు మాత్రం అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట వచ్చే ఐఅండ్‌పీఆర్ అధికారులు, సిబ్బందికి మాత్రమే అనుమతి ఉందని [&hellip;]</p>

CM KCR Warangal Tour LIVE
X

దిశ ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో కవరేజ్ కోసం వచ్చిన మీడియా సిబ్బందిని పోలీసులు అనుమతించడం లేదు. సీఎం పర్యటనను కవర్ చేసేందుకు మీడియా సిబ్బంది సుబేదారి ఆర్ట్స్ కళాశాల వద్దకు చేరుకున్నారు. ఇందుకోసం ముందు రోజు పాసులు కూడా తీసుకున్నారు. కళాశాలలో మీడియా కవరేజ్ వెహికిల్ పెట్టినా పోలీసులు మాత్రం అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట వచ్చే ఐఅండ్‌పీఆర్ అధికారులు, సిబ్బందికి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు చెబుతున్నారు. ముందుగా కవరేజ్‌కి రమ్మని చెప్పి, తీరా పాసులు జారీ చేసిన తర్వాత ఇలా అవమానించడం ఏంటని పలువురు జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు.

ఈటల నిజంగా మారిపోయారా..?

Next Story