- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా ఎఫెక్ట్.. నితిన్ పెళ్లి వాయిదా
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా ఎఫెక్ట్ యంగ్ హీరో నితిన్‌పై పడింది. కోవిడ్ 19 వ్యాప్తి కారణంగా నితిన్ పెళ్లి వాయిదా పడింది. ప్రేమికురాలు షాలినితో నిశ్చితార్థం చేసుకున్న హీరో… ఏప్రిల్ 16న దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేశాడు. కానీ ప్రపంచమంతా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా వివాహాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. ఇందుకు సంబంధించి నోట్ రిలీజ్ చేశాడు. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. లాక్ డౌన్ కాలంలో అత్యవసర […]</p>

దిశ, వెబ్‌డెస్క్: కరోనా ఎఫెక్ట్ యంగ్ హీరో నితిన్‌పై పడింది. కోవిడ్ 19 వ్యాప్తి కారణంగా నితిన్ పెళ్లి వాయిదా పడింది. ప్రేమికురాలు షాలినితో నిశ్చితార్థం చేసుకున్న హీరో… ఏప్రిల్ 16న దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేశాడు. కానీ ప్రపంచమంతా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా వివాహాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. ఇందుకు సంబంధించి నోట్ రిలీజ్ చేశాడు.
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. లాక్ డౌన్ కాలంలో అత్యవసర పరిస్థితుల్లో తప్పా ఎవరూ బయటకు రావొద్దని సూచించిన నితిన్.. మార్చి 30న తన పుట్టినరోజు వేడుకలు జరపొద్దని అభిమానులను ప్రార్థించాడు. అంతేకాదు లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 16న జరగాల్సిన పెళ్లి వాయిదా వేసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ సంక్షోభ సమయంలో ఇంట్లో కాలు మీద కాలేసుకుని కూర్చొని దేశానికి సేవ చేసుకుందామని పిలుపునిచ్చాడు.
Tags: Nithin, Tollywood, CoronaVirus, Covid19






