రాంచరణ్ మీసకట్టుపై నిహారిక కామెంట్స్

by  |
రాంచరణ్ మీసకట్టుపై నిహారిక కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక వివాహం చైతన్యతో ఈ నెల 9న జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత పుణ్యక్షేత్రాలకు వెళ్లొచ్చిన నిహారిక కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌తో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఇక క్రిస్మస్ సందర్భంగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజ్ నివాసంలో మెగా ఫ్యామిలీ మెంబర్స్‌తో మెర్రీ క్రిస్మస్ సెలెబ్రేషన్స్‌లో పాల్గొంది.

సెలెబ్రేషన్స్ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ కోసం స్టైలిష్ లుక్‌లో మారిన రామ్ చ‌ర‌ణ్‌ని త‌న కెమెరాలో బంధించిన నిహారిక.. ఆ ఫొటోను తన ఇన్ స్టా‌లో షేర్ చేసింది. దానిపై డిఫరెంట్ కామెంట్ చేసింది. ముఖం క‌న‌బ‌డ‌కుండా కేవ‌లం మీసం క‌ట్టు క‌నిపించేలా తీసిన ఫొటోకు..టౌన్ మొత్తంలో మంచి మీసం క‌ట్టున్న ఈ మ‌నిషి ఎవ‌రో గుర్తు ప‌ట్టారా? అని ప్రశ్నించింది. నిహారిక పోస్ట్ చేసిన ఫొటో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఈ ఫొటోను రాం చరణ్ కూడా తన ఇన్ స్టా అకౌంట్‌లో షేర్ చేశాడు. సీతారామరాజు రోల్ కోసం పెంచిన మీసం కట్టు అద్భుతంగా ఉందంటూ..నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

https://www.instagram.com/stories/niharikakonidela/2471425156030238356/

Next Story