అలరిస్తున్న నైజీరియా కొంగలు

by  |
అలరిస్తున్న నైజీరియా కొంగలు
X

దిశ,పాలకుర్తి : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలంలో నైజీరియా పక్షులు ప్రజలను అలరిస్తున్నాయి. ప్రతి ఏడాది ఏప్రిల్ మాసంలో వచ్చే నైజీరియా పక్షులు గత నెలలో మండలంలోని కామారెడ్డి గూడెంకు నైజీరియా పక్షులు విచ్చేసాయి.

తెలంగాణ వాతావరణానికి అలవాటుపడిన నైజీరియా పక్షులు స్థానిక కొంగల తో కలిసి స్థానిక ఊరి చెరువులో కి వెళ్లి చిన్న,చిన్న చేపలను,పురుగులను,జలజీవరాసులను ఆహారంగా తీసుకొని జీవిస్తాయి. వర్షాలు పడగానే వాటి జన్మ స్థానమైన నైజీరియా కు వెళ్లిపోతాయి. గత ఏడాది చిన్న మాడురు వచ్చిన నైజీరియా పక్షులు, ఈ ఏడాది కామారెడ్డి గూడెం వచ్చాయి.

Next Story

Most Viewed