తెలంగాణలో వింత రూల్.. డీఎస్పీ కావాలంటే అలా ఉండాల్సిందేనట!

by  |
IPS
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులు, గ్రూప్-1 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఓ సమస్యను లేవనెత్తుతూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు డిప్యూటీ ఎస్పీకి సంబంధించిన ఎలిజిబిలిటీలోని ఓ పాయింట్ అందరినీ కలవరపరుస్తోంది. తెలంగాణలోని గ్రూప్-1 డీఎస్పీ నోటిఫికేషన్లో టీఎస్పీఎస్సీ విధించిన నిబంధనల్లో అభ్యర్థుల ఎత్తు ఖచ్చితంగా 167.6 సెంటీ మీటర్లు ఉండాలి. అయితే, మిగతా రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎత్తు 165 సెంటీ మీటర్ల ఎత్తు ఉంటే సరిపోతుంది.

ఐపీఎస్ ఎంపికకు 165 సె.మి ఉండాలని టీఎస్పీఎస్సీ కూడా ఈ నిబంధనను మార్చాలని నిరుద్యోగులు, డీఎస్పీ ప్రిపేర్ అవుతున్న యువకులు ట్విట్లర్లో డిమాండ్ చేస్తున్నారు. ఎంతో కష్టపడి రేయింబవళ్లు ప్రిపేర్ అయ్యాక అంగులం తక్కువ ఉన్నా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందంటూ గ్రూప్-1 అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే అన్ని రాష్ట్రాల్లో ఉన్న మాదిరిగానే తెలంగాణలోనూ మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

WhatsApp Image

Next Story

Most Viewed