- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: రియల్టర్ హత్య కేసులో కొత్త కోణం..
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్ భాస్కర్ హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. నెల్లూరు జిల్లాకు చెందిన బాబా త్రిలోక్‌నాథ్ సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న బాబా కోసం పోలీసులు గాలిస్తున్నారు. తన అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చినందుకే విజయ్ భాస్కర్‌పై కక్ష పెంచుకున్న బాబా ఈ దారుణానికి ఒడిగట్టారు. విదేశీ నిధులను ఇప్పిస్తానంటూ గతంలో వాగ్దానం చేసిన రియల్టర్ విజయ్ భాస్కర్ నిధులు ఇవ్వకపోగా, తన అక్రమాలను బయట పెట్టేందుకు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్ భాస్కర్ హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. నెల్లూరు జిల్లాకు చెందిన బాబా త్రిలోక్‌నాథ్ సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న బాబా కోసం పోలీసులు గాలిస్తున్నారు. తన అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చినందుకే విజయ్ భాస్కర్‌పై కక్ష పెంచుకున్న బాబా ఈ దారుణానికి ఒడిగట్టారు. విదేశీ నిధులను ఇప్పిస్తానంటూ గతంలో వాగ్దానం చేసిన రియల్టర్ విజయ్ భాస్కర్ నిధులు ఇవ్వకపోగా, తన అక్రమాలను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తుండడంతో బాబా కోపం పెంచుకున్నాడు.
హైదరాబాద్‌కు చెందిన సుధాకర్‌తో విజయ్ భాస్కర్ ను కిడ్నాప్, హత్య చేయించాడు. కిడ్నాప్ చేసిన తరువాత విజయ్ భాస్కర్‌ను కారులో హత్య చేశారు. అనంతరం శ్రీశైలం సున్నిపెంటలో విజయ్ భాస్కర్ అంత్యక్రియలు చేశారు దుండగులు. విజయ్ భాస్కర్ మృతిపై కాటికాపరికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అసలు విషయం బయట పడింది.






