ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్?

by  |
ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్ భారత యూజర్లకు ఒక ఆఫర్‌ను ప్రకటించింది. డిసెంబర్ 5, 6 వారాంతంలో స్ట్రీమ్‌ఫెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆ రెండు రోజుల్లో భారతీయ యూజర్లందరికీ ఉచితంగా కంటెంట్‌ను స్ట్రీమ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. స్ట్రీమ్‌ఫెస్ట్‌లో పాల్గొనడానికి క్రెడిల్ లేదా డెబిట్ కార్డ్ సమాచారాన్ని కూడా ఇవ్వనక్కర్లేదని తెలిపింది. అయితే ఇది కేవలం నాన్ మెంబర్స్‌కు మాత్రమే. అంటే ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోని వాళ్లకే ఈ స్ట్రీమ్‌ఫెస్ట్ అవకాశం. డిసెంబర్ 5న ఉదయం 12:01 నుంచి డిసెంబర్ 6న రాత్రి 11:59 వరకు ఉచితంగా స్ట్రీమ్ చేసుకోవచ్చు. అన్ని రకాల ప్రీమియం కంటెంట్‌ను ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్ అధికారిక వెబ్‌సైట్‌లో లేదా ఆండ్రాయిడ్ యాప్‌లో సైన్ అప్ చేయడం ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు.


Next Story

Most Viewed