శివన్, నయన్ రొమాంటిక్ పోజ్..

by  |
శివన్, నయన్ రొమాంటిక్ పోజ్..
X

దిశ, వెబ్‌డెస్క్ : అందాల తార నయనతారను చూసేందుకు కళ్లు సరిపోవు. అంత అందాన్ని ఒక్కసారి ఎదురుగా చూస్తే ఈ జన్మకు అదే అదృష్టం అని భావించే అభిమానులు కూడా ఉన్నారు నయన్‌కు. అంత గొప్ప అందాల భామ ప్రేమను యాక్సెప్ట్ చేస్తే..దేవతలా చూసుకుంటారు కదా. అవును.. చూసుకుంటారు. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఇప్పుడు అలాగే చూసుకుంటున్నా . నయన్, శివన్ ఇప్పటికే ప్రేమలో ఉన్నట్లు ప్రకటించగా..ఇద్దరి జోడీ పర్‌ఫెక్ట్ అనిపిస్తుంది. కానీ, పెళ్లి మాత్రం ఇప్పుడే కాదు అంటున్న జంట లివింగ్ రిలేషన్ షిప్‌ను సూపర్‌గా ఎంజాయ్ చేస్తున్నామని ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా శివన్ పోస్ట్ చేసిన రొమాంటిక్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ప్రస్తుతం కోయంబత్తూరులో ది రెసిడెన్సీ టవర్స్ లో స్పెండ్ చేస్తూ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న నయన్, శివన్.. బ్లాక్ డ్రెస్సుల్లో రొమాంటిక్ పోజ్..రూమ్ ఇంటీరియర్ డిజైన్ సినిమాటిక్‌గా ఉంది. అది చూస్తే ‘వాహ్ అమేజింగ్ పిక్’అనిపించక మానదు. టీ కప్స్, కాండిల్స్, సోఫాను కవర్ చేస్తూ రొమాంటిక్ పిక్చర్ తీసిన విధానం అదుర్స్ అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం నయన్ ‘మూకుతి అమ్మన్’ సినిమా దీపావళి కానుకగా ఓటీటీలో రిలీజ్ అవుతుండగా..శివన్ డైరెక్షన్‌లో ‘నేత్రికన్’ సినిమా చేస్తుంది. ఈ మధ్యే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

Next Story

Most Viewed