- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Zelensky: నాటో ఆ హామీ ఇస్తే కాల్పుల విరమణకు అంగీకరిస్తాం.. జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు
రష్యా ఉక్రెయిన్ యుద్ధం భీకర స్థాయికి చేరుకున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ (Russia Ukrein) యుద్ధం భీకర స్థాయికి చేరుకున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఆధీనంలో ఉన్న భూభాగానికి రక్షణ కల్పిస్తామని నాటో (Nato) హామీ ఇస్తే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని చెప్పారు. తాజాగా ఆయన ఓ అంతర్జాతీయ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘యుద్ధాన్ని ఆపాలనుకుంటే తమ ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాన్ని నాటో గొడుగు కిందకు తీసుకురావాలి. దీని తరువాత దౌత్య మార్గాల ద్వారా ఆక్రమిత భూభాగాన్ని మేము తిరిగి పొందొచ్చు. ఏ ఒప్పందమైనా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సరిహద్దులను గుర్తించాల్సి ఉంటుంది’ అని చెప్పారు. భవిష్యత్తులో రష్యా మళ్లీ దాడి చేయకుండా ఉండేలా ఇలాంటి ఏర్పాటు అవసరమన్నారు. అయితే ఉక్రెయిన్‌కు ఇప్పటి వరకు ఏ దేశం కూడా అలాంటి ప్రతిపాదన చేయలేదని తెలిపారు. దేశంలోని కొంత భాగానికి మాత్రమే నాటో రక్షణను ఏర్పాటు చేయడం సరికాదన్నారు. నాటోలో చేరాలనే ఆకాంక్షను కూటమిలోని ఏదో ఒక సభ్యదేశం వ్యతిరేకించే చాన్స్ ఉందని చెప్పారు.






