- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Zelensky: రష్యా ఉక్రెయిన్ యుద్ధం.. జెలెన్ స్కీ కీలక ప్రతిపాదన
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఫిబ్రవరి 24వ తేదీ నాటికి మూడేళ్లు పూర్తైన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ (Russia Ukrein) యుద్ధం ప్రారంభమై ఫిబ్రవరి 24వ తేదీ నాటికి మూడేళ్లు పూర్తైన విషయం తెలిసిందే. మూడేళ్లుగా ఇరు దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతుండగా భారీగా ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) కీలక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే దీని కన్నా ముందు ఇరు దేశాలు యుద్ధ ఖైదీలను పరస్పరం రిలీజ్ చేసుకోవాలని ప్రతిపాదించారు. యుద్ధం ప్రారంభమై మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కీవ్‌లో సోమవారం జరిగిన ఓ శిఖరాగ్ర సమావేశంలో జెలెన్ స్కీ మాట్లాడారు. ‘రష్యా ఉక్రెనియన్లను విడుదల చేయాలి. దానికి బదులుగా యుద్ధ ఖైదీలందిరినీ రిలీజ్ చేయడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉంది. సంఘర్షణను ముగించే ప్రక్రియకు ఇదే ప్రారంభం కావాలి’ అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఉక్రెయిన్‌లో నిజమైన, శాశ్వత శాంతికి నాంది పలకాలన్నారు.
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యా, అమెరికాలు వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలోనే జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు యుద్ధానికి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా యూరోపియన్ యూనియన్(ఈయూ) నాయకులు కీవ్‌కు చేరుకుని సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. ఉక్రెయిన్‌కు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ జెలెన్ స్కీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, 2022 ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.






