Yogi: కేజ్రీవాల్‌కు యమునా నదిలో స్నానం చేసే దమ్ముందా.. సీఎం యోగి సవాల్

by B.Srinivas |

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీప్ కేజ్రీవాల్‌పై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శలు గుప్పించారు.

Yogi: కేజ్రీవాల్‌కు యమునా నదిలో స్నానం చేసే దమ్ముందా.. సీఎం యోగి సవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) చీప్ కేజ్రీవాల్‌పై (Kejriwal) ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi aadityanath) విమర్శలు గుప్పించారు. కేజ్రీవాల్ యమునా (Yamuna) నదిని మురికి కాలువగా మార్చారని ఆరోపించారు. కిరారీ ప్రాంతంలో గురువారం జరిగిన ర్యాలీలో యోగీ ప్రసంగించారు. ‘నేను, నా మంత్రులందరితో కలిసి మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశాను. మాలాగే ఢిల్లీలోని యమునా నదిలో కేజ్రీవాల్ తన మంత్రులతో కలిసి స్నానం చేయగలరా?’ అని సవాల్ విసిరారు. దైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పాలన్నారు.

ఆప్ ప్రభుత్వం దేశ రాజధానిని చెత్త కుప్పగా మార్చిందని, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడాన్ని విస్మరించిందని మండిపడ్డారు. నగరంలోని ఓఖ్లా ప్రాంతంలో అక్రమ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు స్థిరపడేందుకు ఆప్‌ సహాయం చేస్తోందని ఆరోపించారు. చొరబాటుదారులకు ఆప్ నాయకుల ఇళ్లలో ఆధార్ కార్డులను తయారుచేస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశ రాజధానిలో రోడ్ల దుస్థితి దారుణంగా ఉందని, మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయని మండిపడ్డారు. యూపీలోని రోడ్లు ఢిల్లీ కంటే మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. కేజ్రీవాల్ పదే పదే యూపీని విమర్శిస్తారని, కానీ యూపీని మోడల్ గా ప్రజలు చూస్తున్నారని చెప్పారు.

Next Story