- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యోగి ఆదిత్యనాథ్ బయోపిక్.. సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరణ
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adithyanath) జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘ది మాంక్ హూ బికమ్ చీఫ్ మినిస్టర్’ అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రవీంద్ర గౌతమ్ దర్శకత్వంలో 'అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి' అనే పేరుతో రీతు మెంగి నిర్మించారు. యోగి ఆదిత్యనాథ్ పాత్రలో అనంత్ జోషి నటించారు. అయితే ఈ సినిమా విడుదలలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. నిజానికి ఇవాళే (ఆగస్టు 1) ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ ఇప్పటి వరకు ఈ మూవీకి సెన్సార్ బోర్డు (CBFC) సర్టిఫికేట్ ఇవ్వలేదు. దీంతో ఆ చిత్ర నిర్మాతలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ స్వీకరించే సమయంలో కోర్టు సెన్సార్ బోర్డును కొన్ని ప్రశ్నలు అడిగింది. ఈ చిత్రానికి ప్రేరణనిచ్చిన నవల ఎనిమిదేళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉండగా, సర్టిఫికేట్‌కు ఎందుకు తిరస్కరించారో తెలపాలని కోర్టు బోర్డును ఆదేశించింది. ఇన్నేళ్లుగా ఈ పుస్తకంపై ఎటువంటి అభ్యంతరం లేనప్పుడు, సినిమా మాత్రం ప్రజా శాంతిభద్రతలకు ఎలా భంగం కలిగిస్తుందని సర్టిఫికేట్ నిరాకరించారని ప్రశ్నించింది. వీటికి సమాధానాలను ఇవ్వాలని సెన్సార్ బోర్టుకు నోటిసులు జారీ చేసింది. దీనికి ప్రతిస్పందనగా, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని బోర్డు గత వారం కోర్టుకు హామీ ఇచ్చింది. ఈ క్రమంలో బోర్డు సభ్యులు సినిమాను చూడకుండా కేవలం ట్రైలర్ చూసి సర్టిఫికెట్ రిజెక్ట్ చేశారని నిర్మాతల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇక దీనిపై శుక్రవారం విచారణ జరుగనుంది.






