అతిక్ అహ్మద్ దారుణ హత్య ఘటనలో కీలక పరిణామం

by Dishafeatures2 |
అతిక్ అహ్మద్ దారుణ హత్య ఘటనలో కీలక పరిణామం
X

దిశ, డైనమిక్ బ్యూరో: గ్యాంగ్ స్టార్, లోక్ సభ మాజీ సభ్యుడు అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ ను దుండగులు కాల్చి చంపిన కేసులో ఐదుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన షాహ్ గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ అశ్వనీ కుమార్ తో పాటు ఓ సబ్ ఇన్ స్పెక్టర్, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

గత శనివారం అతిక్ అహ్మద్, అష్రఫ్ లను హెల్త్ చెకప్ కోసం పోలీసులు ప్రయాగ్ రాజ్ లోని షాహ్ గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ మీడియా ముసుగులో వచ్చిన దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తుపాకితో కాల్చి చంపారు. ఈ ఘటనలో పోలీసులు నిర్లక్ష్యం ఉందని సిట్ దర్యాప్తులో తేలడంతో ఐదుగురిపై చర్యలు తీసుకున్నారు. మరోవైపు అతిక్ మరియు అతని సోదరుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను బుధవారం ఇక్కడి చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపింది.



Next Story

Most Viewed