Wrestlers Protest : గంగానది వద్దకు చేరుకుని విలపిస్తున్న రెజ్లర్లు

by Disha Web Desk 4 |
Wrestlers Protest : గంగానది వద్దకు చేరుకుని విలపిస్తున్న రెజ్లర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలపై భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిని అరెస్ట్ చేయాలని రెజర్లు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం రెజ్లర్లు భజ్ రంగ్ పూనియా, వినేష్ ఫోగట్, సాక్షిమాలిక్ హరిద్వార్ వద్ద గంగానదికి చేరుకుని విలపిస్తున్నారు. ఎంపీ బ్రిజ్ భూషన్ ను అరెస్ట్ చేయనుందకు రెజ్లర్లు నిరసన తెలుపుతున్నారు. అయితే బ్రిజ్ భూషన్ లైంగిక వేధింపులను నిరసిస్తూ రెజ్లర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తమ పతకాలు గంగానదిలో వేసేందుకు రెజ్లర్లు సిద్ధమయ్యారు. పతకాలు గంగానదిలో వేస్తామని ఉదయమే రెజ్లర్లు వెల్లడించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. బ్రిజ్ భూషన్ ను అరెస్ట్ చేయాలని కొన్నాళ్లుగా రెజ్లర్లు ఆందోళన బాట పట్టారు.

Next Story

Most Viewed